NLR: కలిగిరి మండలంలో మట్టిని అనుమతులు లేకుండా యథేచ్చగా తవ్వేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దాదాపు మండలంలో అన్నీ చెరువులు తవ్వేస్తూ ధ్వంసం చేస్తున్నారని, ఆ మట్టిని ట్రాక్టర్లలో, లారీల్లో తరలిసున్నారని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.