NLG: పండుగల సీజన్లో ఆర్టీసీ వారు చార్జీలు పెంచడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చార్జీలే ప్రయాణికులు భారంగా చెల్లించి ప్రయాణిస్తుండగా పండుగల పేరుతో మరో 50 శాతం చార్జీలు పెంచారు. ప్రైవేటు వారే నయమనే అభిప్రాయానికి వస్తున్నారు. పండుగలు వచ్చేది ఆర్టీసీ వారు దోచుకునేందుకేనా అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.