SRPT: డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో పోలీసులపై దాడి చేసిన ఘటనలో 14 మందిని అరెస్టు చేసినట్లు హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన 14 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.