కోనసీమ: శాసనసభలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుకి అధికారికంగా కేటాయించిన నూతన ఛాంబర్‌ను ఆత్మీయ వాతావరణంలో గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ఛాంబర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, పర్సనల్ సెక్రటరీ సుబ్బరాజు, సిబ్బంది పాల్గొని దాట్ల సుబ్బరాజుకి అభినందనలు తెలియజేశారు.