కృష్ణా: ఉయ్యూరు ఎక్సైజ్ పోలీసులు గురువారం 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెనమలూరు నియోజకవర్గం కానూరులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని ఎక్సైజ్ పోలీసులు కోరారు.