NRML: నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్‌ను ఏఎస్పీ రాజేశ్ మీనా గురువారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి భరోసానివ్వాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ, స్టేషన్ ఆవరణ, గార్డెన్ బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేసి ఎస్పై గణేష్‌ను అభినందించారు.