NZB: బోధన్ RTC డిపో నుంచి దసరా పండుగ సందర్భంగా రోజువారీ సర్వీసులు కాకుండా అదనంగా 58 స్పెషల్ బస్సులు నడుపనున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ గురువారం తెలిపారు. ఈ స్పెషల్ బస్సుల్లో మాత్రమే 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తారని, డైలీవారీ సర్వీస్‌లో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకావాలని కోరారు.