ELR: అల్లూరు పట్టణంలోని ఆర్డిఆర్ కాలనీలో గురువారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం నగర పంచాయతీ కమిషనర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.