AP: ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీది కపట ప్రేమని మంత్రి పయ్యావుల విమర్శించారు. ఉద్యోగుల సొమ్ము రూ.21 వేల కోట్లను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ‘ట్రస్టీగా ఉండాల్సిన సొమ్మును కూడా వాడేసిన పరిస్థితి. ఉద్యోగుల జీపీఎఫ్‌ను దారి మళ్లించారు. పథకాల కోసం ఆ ఫండ్స్‌ను వాడుకున్నారు. విపక్షాల తీరు దెయ్యాలు వేదాలు వళ్లించినట్టు ఉంది’ అని పేర్కొన్నారు.