BHPL: గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి సందర్భంగా ఏర్పాటైన దుర్గామాత విగ్రహానికి గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.