SRD: మండల కేంద్రమైన కంగ్టిలోని పోచమ్మ ఆలయంలో కొనసాగిన దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం కాత్యాయని అమ్మవారి రూపంలో పోచమ్మ తల్లి దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు, పట్టు వస్త్రాలు, ఓడి బియ్యం, పలువిధ ద్రవ్యం, పండ్లు, ఫలాలు సమర్పించి మహా మంగళ హారతి చేశారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.