కృష్ణా: స్వచ్ఛతా హీ సేవా (స్వచ్ఛ మహోత్సవ్ ) ఏక్ దిన్, ఏక్ గంటా, ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా శానిటరీ సిబ్బంది,సచివాలయ సిబ్బందితో కలిసి మున్సిపల్ కమిషనర్ మనోహర్ గుడివాడ ఆర్టీవో కార్యాలయంలోని పరిసరాలను గురువారం శుభ్రం చేశారు. అనంతరం అధికారులకు మున్సిపల్ కమిషనర్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని తెలిపారు.