SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో గ్రామస్తులు గురువారం స్వచ్ఛతాహీ సేవా శ్రమదానం చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పీరప్ప, అంగన్వాడి టీచర్లు, పొదుపు సంఘాల మహిళలు భాగస్వాములై స్థానిక పరిసరాలను పరిశుభ్రం చేశారు. గ్రామ స్వచ్ఛతకు అందరూ సహకరించాలని MPO బ్రహ్మంచారి, సెక్రటరీ నవీన్ రెడ్డి కోరారు.