సౌదీ-పాక్ రక్షణ ఒప్పందంపై భారత్ స్పందించింది. భారత్-సౌదీ అరేబియాల మధ్య విస్తృత శ్రేణి వ్యూహత్మక భాగస్వామ్యం ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇది గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తుందన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర ప్రయోజనాలను, సున్నితత్వాన్ని సౌదీ దృష్టిలో ఉంచుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.