CTR: సోమల మండలంలోని చెన్నపట్నం చెరువు, గువ్వలగుట్ట, వీర్లపల్లి ఎస్టీ కాలనీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. కాలనీల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తిరిగి నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.