KMM: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందారు. సింగరేణి మండలం మంగలితండాకు చెందిన రైతు ధరావత్ పంతులు (52) నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అతడిని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.