AP: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకానికి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే పేరును ఖరారు చేసింది. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ల డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున సాయం అందించనున్నారు. మొత్తం 3.20 లక్షల అర్జీలు రాగా వీటి పరిశీలన తుది దశలో ఉంది. ఈరోజు అర్హులైన డ్రైవర్ల తుది జాబితా సిద్ధం కానుంది.