SRCL: పోషణ మాసం కార్యక్రమాలను గర్భవతులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ ఐసీడీఎస్ సీడీపీవో సౌందర్య అన్నారు. చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో బుధవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం సెప్టెంబర్ మాసంలో పోషణ మాసం కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.