KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు కల్లూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం భగత్ వీడు, మంగలితండా, ఈశ్వరమాధారం, రాజుపేట బజార్, పెరికసింగారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.