ప్రకాశం: జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నా వెంకట రాంబాబు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువా, బొకేతో సన్మానించారు. అనంతరం ఇరువురు స్థానిక పరిస్థితులపై చర్చించారు.