ప్రకాశం: ప్రతి నీటి బొట్టు ప్రజలకు ఉపయోగపడేలా సరఫరా, నీటి వనరుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, ప్రాజెక్టుల అధికారులతో బుధవారం ఒంగోలు ప్రకాశం భవనంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, జిల్లాలోని వివిధ తరహా జలాశయాల నిర్వహణపై ప్రత్యేకంగా సూచించారు.