ప్రకాశం: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. గురువారం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.