GNTR: మంగళిగిరి రూరల్ స్టేషన్ పరిధిలో బైక్ల చోరీకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను సీఐ శ్రీనివాస్ బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. తుళ్ళురూకు చెందిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 10 బైక్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.