లడఖ్ రాజధాని లేహ్‌లో అల్లర్లపై ఈరోజు, రేపు ఉన్నతస్థాయి కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. నిన్న జరిగిన అల్లర్లలో నలుగురు మృతిచెందగా.. 40 మంది పోలీసులు సహా 80 మందికి గాయాలయ్యాయి. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న లేహ్‌లో బీజేపీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే.