NDL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో అధికారులను ఆదేశించారు. మండలస్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలు చురుగ్గా పనిచేయాలని సూచించారు. జిల్లాలో కొత్తగా 5 డీసిల్టేషన్ పాయింట్లకు అనుమతులు, 3 రీచ్లకు టెండర్లు జారీ చేసినట్టు వెల్లడించారు.