ELR: కామవరపుకోట నుంచి కళ్ళచెరువు వెళ్లే దారిని అధికారులు మళ్లించారు. అంకాలంపాడు చెరువు వద్ద కల్వర్టు నిర్మాణం జరుగుతోంది. దీంతో నాలుగు రోజులు పాటు ఈ రోడ్డులో వాహన రాకపోకలు అధికారులు నిలిపివేశారు. కామవరపుకోట నుంచి కళ్ళచెరువు వెళ్లేవారు కొల్లి వారి గూడెం, గుంటుపల్లి, దేవినేని వారి గూడెం మీదుగా వెళ్లాలని అధికారులు చెప్పారు.