W.G: ఏలూరులోని ఆర్ఆర్ పేటకు చెందిన మేకా రమాదేవి డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆధార్‌తో సంఘ విద్రోహ చర్యలు జరిగాయని ఫోన్లో ఓ వ్యక్తి బెదిరించి ఆమె నుంచి దశలవారీగా రూ. 51 లక్షలు దోచుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన రమాదేవి బుధవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.