SKLM: జలుమూరు మండలంలోని తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు రైల్వే పోలీస్ ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.