AP: TTD పరిధిలోని పరకామణిలో చోరీకి సంబంధించి TTD బోర్డు సభ్యుడు భానుప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకామణిలో రవికుమార్ దోచుకుంటే YCP నేతలు, అధికారులు పంచుకున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్లో పెట్టారని తెలిపారు. YCP హయాంలో రూ.100 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. భూమన దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అందరి పేర్లు త్వరలో బయటకు వస్తాయని అన్నారు.