SRPT: కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు ముందస్తుగా బతుకమ్మ పండుగను శనివారం వినూత్నంగా నిర్వహించారు. పూల మాదిరిగా అమరి, రంగురంగుల దుస్తులతో చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బతుకమ్మ పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ ప్రదర్శన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది.