MDK: కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-1 శిబిరం నిర్వహించారు. పోతంశెట్టిపల్లి గ్రామంలో మంగళవారం డిగ్రీ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శ్రమదానం నిర్వహించి, వీధుల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించారు. మురుగు కాల్వలో మురుగు తొలగించి శుభ్రం చేశారు.