BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామంలో 50 సంవత్సరాల నాటి రోడ్డు సమస్యకు విముక్తి కలిగిందని గ్రామానికి చెందిన పలువురు ప్రజలు మంగళవారం తెలియజేశారు. గతంలో రోడ్డు లేక ఇబ్బందులు పడ్డామని, వర్షాకాలంలో గుంటలలో నడిచామని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే కొండయ్య సహకారంతో రోడ్లు ఏర్పడ్డాయని తెలిపారు.