VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని బౌడరా రోడ్డులోని మౌర్య హోటల్ సమీపంలో మంగళవారం జరిగిన గొడవలో ఒక యువకుడిపై కత్తితో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.