ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2026 ఆస్కార్ రేసులో తెలుగు నుంచి పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. టాలీవుడ్ నుంచి ‘పుష్ప 2’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘కన్నప్ప’, ‘గాంధీ తాత చెట్టు’, ‘కుబేర’ ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ ‘హోమ్‌బౌండ్’ మూవీ పోటీపడుతుంది.