WNP: ఆత్మకూరు మండలం పిన్నంచర్లలో దివ్యాంగులు, వృద్ధుల పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామ కార్యదర్శి భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర MTPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మండల అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. శనివారం గ్రామ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.