సత్యసాయి: బీసీ నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందజేసినందుకు మంత్రి సవితకు స్కోచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా శనివారం స్కోచ్ అవార్డుల కమిటీ ఛైర్మన్ సమీర్ కొచ్చార్ చేతుల మీదుగా మంత్రి సవిత స్కోచ్ అవార్డును అందుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంలో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు.