NLR: ఉదయగిరి MLA కాకర్ల సురేష్ శనివారం వింజమూరు పంచాయతీ ప్రాంగణంలో ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్’, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరు ఉద్యోగులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తారని తెలిపారు.