నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది వరి కోతల సీజన్ సమయం కాబట్టి ఆకస్మాత్తుగా కురిసిన వర్షాలతో రైతన్నలు కాస్త తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు, బీరంగుంట, రైస్ మిల్ కాలనీ తదితర ప్రాంతాల్లో మోస్తారుగా వర్షం కురిసింది.