JGL: జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని శ్రీ భ్రమరాంబికా దేవి సేవా సమితి సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమంలో ఏర్పాటు చేయనున్న ద్వితీయ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.