మలయాళ స్టార్ మోహన్ లాల్.. అతని స్నేహితులు తీసిన ‘తిరనోట్టమ్’ అనే మూవీతో సినీరంగ ప్రవేశం చేశారు. ‘మంజిల్ విరింజ పూక్కల్’ అనే మలయాళ మూవీలో విలన్ పాత్రపోషించారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల్లో ఆయన నటించారు. ఇప్పటి వరకు దాదాపు 360కి పైగా సినిమాల్లో కనిపించారు. నేపథ్య గాయకుడిగా ‘సింధూర మేఘం’ అనే మలయాళ పాటను అందించారు. ‘ప్రణవం ఆర్ట్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.