TG: బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ప్రజల ఐక్యతకు ప్రతీక అని రేవంత్ అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని గౌరమ్మను ప్రార్థించినట్లు చెప్పారు. గౌరీమాత అందరికీ ఆయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని గవర్నర్ ఆకాంక్షించారు.