BHPL: గణపురం, రేగొండ మండల కేంద్రంలో 167 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.55.18 లక్షల చెక్కులను శనివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి పేదలకు గొప్ప వరమని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.