హుజూర్నగర్ నియోజకవర్గంలో కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలు అధికంగా ఉండటం చేత అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొన్నాయి. ఇక్కడి వనరులను, అటవీ భూమిని వాడుకుంటూ.. స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు మాత్రం తమ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు ఇవ్వడంలేదని స్థానికులు వాపోతున్నారు. దీనివల్ల తల్లిరత్న గర్భగా ఉన్న బిడ్డలు గర్భదరిద్రులుగా మిగిలిపోతున్నారు.