KMM: సింగరేణి సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా పండుగ అడ్వాన్స్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులను ఇవాళ జారీ చేసింది. అర్హులైన రెగ్యులర్ సిబ్బందికి రూ.25 వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.12,500 ఖాతాలో జయ చేయనున్నారు. ఈనెల 23న బ్యాంకు జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.