రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై US అధ్యక్షుడు ట్రంప్ UK ప్రధాని కీర్ స్టార్మర్ చర్చించారు. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడం, ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు స్టార్మర్ అంగీకరించారని ట్రంప్ తెలిపారు. చమురు అమ్మకాలు ఆగిపోతే పుతిన్ శాంతికి అంగీకరిస్తారన్న తన ఆలోచనను స్టార్మర్ ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. శాంతి నెలకొల్పేందుకు ఇది సరైన చర్య అని ట్రంప్ అన్నారు.