CTR: పుంగనూరు మండలం చంద్రమాకులకు చెందిన నవనీతకు 12 ఏళ్ల కిందట మంజునాథ్ వివాహం జరిగింది. ఆ సమయంలో రూ.5లక్షలు, 100 గ్రాముల బంగారు నగలు ఇచ్చారు. ఇటీవల అదనపు కట్నం తీసుకు రావాలంటూ తనను భర్త, అత్త భాగ్యమ్మ, మేనత్త లక్ష్మీదేవి, ఆడబిడ్డ శోభారాణి వేధిస్తున్నారని బాధితురాలు వాపోయారు. పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.