NDL: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని నంద్యాల జిల్లా జోన్ సీఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మహానంది మండలం సీతారామపురంలో మహానంది పోలీస్ సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి పర్యటించారు. ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ.. ఎలాంటి గొడవలకు ఘర్షణలకు పాల్పడకుండా అందరు శాంతియుతంగా జీవనం సాగించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.