అన్నమయ్య: సుండుపల్లి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవటంతో పించా ప్రాజెక్టు డ్యాం పూర్తిగా నిండింది. బుధవారం సాయంత్రం రాజంపేట సబ్ కలెక్టర్ భావన ప్రాజెక్టును పరిశీలించి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో తెగిపోయిన ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయినట్లు, ప్రాజెక్టులో చేపల పెంపకానికి సొసైటీ ఉందని అధికారులు తెలిపారు.