అన్నమయ్య: రామసముద్రం మండల కేంద్రంలోని గాజులనగరానికి చెందిన 21 మందిని మంగళవారం తహసీల్దార్ మహ్మద్ అజారుద్దీన్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. సోమవారం బహిరంగ ప్రదేశంలో గొడవలకు పాల్పడిన వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా పూచీకత్తుపై తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు వివరించారు.