KDP: దొంగ నోట్ల మార్పిడి కేసులో ఐదుగురు ముద్దాయిలకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేలు జడ్జి పద్మశ్రీ మంగళవారం తీర్పునిచ్చారు. SI మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. సిద్ధవటం మండలంలో మాధవరం-1లోని ఓ వైన్ షాపులో 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన మాధవరెడ్డి, ప్రకృతిన్, వెంకటేశ్వర్లు, ఆప్తాప్, హుస్సేన్ వలీలు దొంగ నోట్లు చలామణి చేయగా కేసు నమోదు అయిందని తెలిపారు.